![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 04:49 PM
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో గల భూముల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూములను పరిరక్షించాలంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో సైతం లేవనెత్తారు.కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవ నివేదికను పంపాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖను తాజాగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.ఈ నేపథ్యంలో న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని, అటవీ చట్టాలకు లోబడి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూమికి సంబంధించిన వాస్తవ నివేదిక వివరాలను, తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని కేంద్రం పేర్కొంది.