![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:32 PM
బీసీ గర్జన నిప్పురవ్వలా రగిలి దేశం మొత్తం వ్యాపిస్తుందని ఢిల్లీ గడ్డపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ గడ్డమీద ఎలా ఉంటారో మేము చూస్తామని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బీసీల డిమాండ్లకు మీరు దిగైనా రావాలి లేదా దిగైనా పోవాలి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అందరు మద్దతు తెలుపుతుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బలహీనవర్గాల రిజర్వేషన్లు పెంచితే మీకు వచ్చిన బాధ ఏంటి? అని ప్రశ్నించారు.