![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:52 PM
జిల్లా కేంద్రంలో ఈనెల 5న నిర్వహించే పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను బుధవారం దన్వాడ మండల కేంద్రంలో యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులను పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కనీస వేతనాలు ఇవ్వాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.