![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 08:30 PM
యాసంగిలో పెద్దపల్లి జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.