![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:16 PM
బాన్సువాడ మండలం, బోర్లం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 న జరిగే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యువకులకు గ్రామ క్రీడా ప్రాంగణంలో గురువారం ఆటలపోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నల్లోళ్ళ సాయిలు మాట్లాడుతూ క్రికెట్, వాలీబాల్, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.