![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 08:15 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్‌సీయూ భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై బీజేపీ నేత, మెదక్ లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు స్పందించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల విషయంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.విద్యార్థుల పోరాటం ఫలితంగానే ఈ కోర్టు ఆదేశాలు వెలువడ్డాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ భూముల పరిరక్షణ కోసం తాము సైతం పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు.ఒక్క చెట్టును కొట్టివేయలన్నా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, అలాంటిది వందల సంఖ్యలో చెట్లను కొట్టివేస్తే ఎలా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని భావించిన ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు చెంపదెబ్బలాంటివని అభివర్ణించారు.