![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:01 PM
కనగల్ మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే అంతర్గత బీటీ రోడ్లు ధాన్యం కల్లాలుగా మారాయి. ఆయా గ్రామాల రైతులు రోడ్డుపైనే ధాన్యం ఆరబోస్తుండడంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు.
రాత్రివేళ ఆరబోసిన ధాన్యం కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడిపోవడంతో గాయాల పాలవుతున్నారు. ఇటీవల అనేకమంది ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోయి ఆసుపత్రుల పాలయ్యారు.