![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:04 PM
హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్. గౌతమ్‌రావును అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. కాగా, మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈరోజే నామినేషన్లకు చివరి తేదీ కాగా, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.