![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 09:25 PM
నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం సమయంలో ఎర్త్ డ్యాం దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ప్రమాదాన్ని గమణించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పే సమయానికే ఎర్త్ డ్యాం మీద ఉన్న సీసీ కెమెరాలు , వైర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కాగా కొద్ది రోజుల క్రితం నాగార్జున సాగర్ మెయిన్ ఎర్త్ డ్యాం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో చెట్లతో పాటు కొంత మేర సామాగ్రి ధ్వంసం అయ్యింది. అలాగే ఫిబ్రవరిలో కూడా రెండు సార్లు డీఫారెస్ట్ ఏరియాలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.