![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 09:17 PM
శ్రీరామ నవమిని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. ధూల్‌పేటలో ప్రారంభమైన శోభయాత్ర కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. జై శ్రీరామ్ నామస్మరణతో నగర వీధులు మార్మోగిపోతున్నాయి. నగర నలుమూలల నుంచి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఈ రమణీయ ఘట్టంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం నగర ప్రజలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ కాషారంగును పులుముకున్నాయి. శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 6.2 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.