![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 09:14 PM
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, భవేష్ మిశ్రా దంపతులు జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న రామాలయం దేవాలయంలోని సీతారాముల వారికి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్యాండ్, మేళాల తో జిల్లా కలెక్టర్ దంపతులు ఇలా త్రిపాఠి,త్రిపాఠీ, ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రా లు తలపై పట్టు వస్త్రాలను ఉంచుకొని స్వామి, అమ్మవార్లకు సమర్పించారు.