![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 09:13 PM
తెలంగాణలో సోమవారం, మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. సోమవారం ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.ఏప్రిల్ 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల వాసులు వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరింంచింది.