![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:57 PM
ఉట్కూరు మండలం తిప్రాస్ పల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన నాభిశిల (శీతాలదేవి) బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, విఘ్నేష్ రెడ్డి, మహేష్, లింగం, నాయకులు పాల్గొన్నారు.