![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 07:20 PM
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు.హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు