|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 03:03 PM
మేడే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం, కార్మిక చట్టాలను, హక్కులను రక్షించడానికి, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి.
ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నాడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఎర్రజెండాను ఎగరవేయడం జరిగింది. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.