|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 03:25 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అశోక్ నగర్ కాలనీలో ఉంటున్న నవ వధువు పూజిత (20) భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా పూజితకు ఏడు నెలల క్రితం సాయి కుమార్ అనే వ్యక్తితో వివాహమైందని స్థానికులు తెలిపారు.
కొన్ని రోజులు మంచిగా ఉన్నారని, తర్వాత భర్తాభర్తలు తరుచు గొడవలు పడేవారిన్నారు. దీంతోనే పూజిత మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.