|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 03:19 PM
నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం ప్రపంచ 139వ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా నిర్వహించారు. సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యదర్శి రాము.
బస్టాండ్ వద్ద టియుసిఐ పట్టణ కార్యదర్శి నరసింహ, కూరగాయల మార్కెట్ యార్డులో నాయకులు నారాయణ సీఐటీయూ జండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తోందని ఆరోపించారు.