|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 11:37 AM
చండూరు మండలం పుల్లేములలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతున్నట్లు సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
లారీల ఆలస్యంపై లారీ కాంట్రాక్టర్తో మాట్లాడిన కలెక్టర్, సమస్య లేకుండా వాహనాలను ఏర్పాటు చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం నుండి ప్రతిరోజు రెండు వాహనాలు సిద్ధం చేసి, ధాన్యాన్ని సకాలంలో పంపించాలని ఆదేశించారు.