|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 11:57 AM
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దాసరి పవన్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క దాడి చేయడంతో మృతి చెందాడని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సీఐ మహమ్మద్ షాకిర్ అలీ స్పష్టం చేశారు.
పవన్ శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ, ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని తెలిపారు. యజమాని కుప్పకూలిన సమయంలో పెంపుడు కుక్క అతడిని లేపేందుకు ప్రయత్నించగా, మర్మాంగాలపై గాయాలు అయ్యాయని సీఐ వివరించారు.