|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 12:07 PM
వనపర్తి జిల్లాలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరుకు చెందిన మహేశ్ (22) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, మదనాపురం మండలం రామన్‌పాడ్ వద్ద ఉన్న పోచమ్మ గుడి సమీపంలోని రైల్వే పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి మహేశ్ ఈ ఘోర చర్యకు పాల్పడ్డాడు.
ఇటీవల మహేశ్‌కు తన సమీప బంధువులతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన అతడు, ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో జీవితంపై నిరాశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.