|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 06:47 AM
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలు దేశాల అందగత్తెలు కిరీటం కోసం పోటీ పడుతున్న ఈ వేదికపై, భారత ప్రతినిధి నందిని గుప్తా ప్రస్థానం టాప్-8 దశలోనే ముగిసింది.ఈ పోటీల్లో భాగంగా ప్రకటించిన టాప్-8 జాబితాలో నందిని గుప్తా స్థానం దక్కించుకోలేకపోయారు. టాప్-8లో నిలిచిన సుందరీమణులలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.ఆ తర్వాత ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. అమెరికా అండ్ కరీబియన్ మార్టినిక్, ఆఫ్రికా ఇథియోపియా, యూరప్: పోలెండ్, ఆసియా థాయ్‌లాండ్ సుందరీమణులు ఉన్నారు. ఖండాల వారీగా ఎంపికైన టాప్ నలుగురు కంటెస్టెంట్లను న్యాయనిర్ణేతలు ప్రశ్నలు అడుగుతున్నారు.