|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 06:47 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఆదివారం పోలేపల్లి ఎక్స్ రోడ్ వద్ద జరిగిన మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వారి మద్దతు సాధించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సిరాజ్ ఖాన్, సర్వయ్య, బద్యనాయక్, మల్లారెడ్డి తదితర నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.