|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 12:12 PM
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన దివంగత ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.