|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 12:16 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గత పదేళ్లలో తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని వ్యాఖ్యానించారు. దశాబ్దాల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ.. గత పదేళ్ల ఆధిపత్యాన్ని ప్రజలు తిరస్కరించి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలోని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆయన.. తెలంగాణను పునర్నిర్మించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.సన్న బియ్యం పథకం ద్వారా 3 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు . ఖమ్మంలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసినప్పుడు ఆ పేదల కళ్లలో చూసిన ఆనందాన్ని నేను ఎప్పటికీ మరవలేను