|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:21 PM
బీజేపీ పెద్దలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన సోమవారం తీవ్రంగా స్పందించారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు, ధైర్యముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని కొందరి అసలు స్వరూపాలను బయటపెడతానని, అందరి జాతకాలు ప్రజల ముందు ఉంచుతానని హెచ్చరించారు.కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, నాయకత్వానికి దూరంగా ఉంటున్నారనే ఆరోపణలతో పాటు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణంతో రాజాసింగ్‌కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.