|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:23 PM
నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలో భాగంగా జరిగిన 6వ రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై తెలుగు తేజం గుకేశ్ అద్వితీయ విజయం సాధించాడు. ఈ చెస్ టోర్నమెంట్‌లో ఘన విజయం సాధించిన గుకేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.గుకేశ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గుకేశ్ అసాధారణమైన, అత్యుత్తమ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2024లో గుకేశ్ విజయం అతని ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. గుకేశ్‌కు ఇలాంటి మరిన్ని అద్భుత విజయాలు లభించాలని ఆకాంక్షించారు.