|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:46 PM
పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల విద్యార్థులకు, బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో, మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి... విద్యార్థుల తల్లిదండ్రులను, అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.... మంచి ప్రతిభ కనబరిచిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు. 593 మార్కులు సంపాదించిన దుర్గాభవాని, 590 మార్కులు సంపాదించిన శివాని, 580 కి పైగా మార్కులు సంపాదించిన 31 మంది, 570 పైన మార్కులు సంపాదించిన 216 మంది విద్యార్థులు... వారి తల్లిదండ్రులకు, వారి ప్రాంతానికి, రాష్ట్రానికి పేరు తెచ్చారు. విద్యార్థులంతా పోటీ ప్రపంచంలో నెగ్గేలా విధానపరమైన మార్పులను అవగతం చేసుకోవాలి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఇచ్చి, విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించడానికి 40 శాతం మెస్ చార్జీలు పెంచాం; 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచాం. ట్రెక్కింగ్, సెయిలింగ్ పోటీలకు కూడా వారికి నైపుణ్యాల శిక్షణ అందిస్తున్నాం. మన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. రేపటి #తెలంగాణ భవిష్యత్తుకి మార్గదర్శకులు కావాలి. స్టడీస్, ఆటలు, ఇతర నైపుణ్యాల్లో మంచి ప్రతిభ కనబరచాలి; రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి. విద్యకే పరిమితం కాకుండా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలి. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.