|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 04:00 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలోని విశాల తిరుపతి సహకార సంఘంను మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పంట విస్తీర్ణం బట్టి ఎరువులు రైతులకు అందజేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ ఎం శ్రీనివాస్, సీనియర్ ఇన్‌స్పెక్టర్ నిజాం, మెట్పల్లి సహకార సంఘ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.