|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 10:41 AM
కాప్రా డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ కి చెందిన తాడెం వెన్నెల తాండూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో ఈమె గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి చికిత్స పొందుతున్న ఈమెను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అధికారులతో మాట్లాడి హాస్పిటల్ లో అయ్యే ఖర్చు ప్రభుత్వం కట్టే విధంగా చేయడం జరిగింది.అలాగే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరీ నవీన్ గౌడ్, ప్రసాద్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.