|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:38 PM
నర్సాపూర్ చిలిపి చెడు మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో ఎఫ్పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ కరుణాకర్ శనివారం సందర్శించారు. కొనుగోళ్ల పురోగతి, రైతులకు కల్పించిన సౌకర్యాలు, ఇబ్బందులను ఆయన పర్యవేక్షించారు. ధాన్యం సేకరణ, తూకం వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యాసీన్, గోపాల్ రావు, సెంటర్ ఇంచార్జి ప్రశాంత్, మైపాల్, రైతులు పాల్గొన్నారు.