|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 11:36 AM
నల్గొండ డిఎస్పి శివరాంరెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మిషన్ ట్రిపుల్ ఆర్ కార్యక్రమంలో భాగంగా సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.