|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 12:10 PM
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారు పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అవుషాపూర్ కేపాల్ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓబెడ్ ఫోమ్ ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రేగి దట్టమైన పొగలతో ఆకాశమంత ఆవరించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.