|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 12:28 PM
వనపర్తి పట్టణ భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 23న నిర్వహించనున్న సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరుకావాలని సత్య సాయి సేవా సమితి వనపర్తి జిల్లా కన్వీనర్ రమేష్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ, సమాజ సేవ, ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసం సత్యసాయి బాబా చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు, శివకుమార్ నాయుడు, సత్య సాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.