|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 02:30 PM
సినిమా పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కరేబియన్ దీవులు కేంద్రంగా ఆరేళ్లుగా 66 మిర్రర్ వెబ్‌సైట్లలో పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. 50 లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరస్థులు, గేమింగ్, బెట్టింగ్‌యాప్‌ల నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పేర్కొన్నారు. నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కస్టడీలో రవి నుంచి మరింత సమాచారం సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.