|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 02:42 PM
TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ఠ అని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని, ప్రతిపక్ష నేతలను వేధించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి, రాజకీయ లబ్ధి కోసం చిల్లర డ్రామాలు చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.