|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:03 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బుధవారం నేరుగా హెచ్చరిక జారీ చేశారు. 'పవన్ నన్నేం పీకుతారని అనుకోని క్షమాపణలు చెప్పడం లేదు. ఇకపై జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనీయను' అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కోనసీమకు 'నర దిష్టి' తగిలిందని పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారానికి దారితీశాయి.