|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:57 PM
TG: కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో నాటు బాంబు అమర్చారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.