|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:53 PM
పేదలకు అర్హత ఆధారంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అనువైన ప్రదేశాల్లో రాజకీయ జోక్యం లేకుండా స్థలాలు ఇవ్వాలని, గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ కు బుధవారం వెల్దుర్తిలో వినతిపత్రం అందజేశారు. రేషన్ సరఫరాలో అవకతవకలు, గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులకు డి. పట్టాలు ఇవ్వాలని కోరారు.