|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:41 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ విడుదల చేయనుంది. గవర్నర్ ఇప్పటికే ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. ఆర్డినెన్స్ విడుదలైన మూడు రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన పత్రాల తయారీలో నిమగ్నమయ్యారు. మరోవైపు, వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టనున్నారు.