|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:20 PM
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే ట్విన్స్‌కు జన్మనిచ్చారు. జనవరి 31న మెగా ఫ్యామిలీకి వచ్చిన ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచారు.దీంతో మెగా ఫ్యాన్స్ మాత్రమే కాక, టాలీవుడ్ అభిమానులు కూడా ఈ ఆనందాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. తాజాగా, ఉపాసన ఎమోషనల్ వీడియోతో ట్విటర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ట్విన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఉపాసన తన పోస్ట్‌లో ఇలా రాశారు:"ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతుంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలత కోసం నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతం. తేజస్వి గారు, అపోలో హాస్పిటల్స్ బృందం మా కోసం అద్భుతంగా పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ మనసు నుంచి వస్తుందని తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని, వారి భద్రతను గౌరవిస్తారని నాకు నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో నిలిచి ఉంటాయి."
Latest News