|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 11:00 AM
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా, 'జాతి రత్నాలు' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇటీవల తిరువీర్ హీరోగా వస్తున్న 'భగవంతుడు' సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో, అలాగే తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న 'గాయపడ్డ సింహం' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో, తాను ఒక హిందూ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నానని, ఇద్దరం కలిసి టీమ్ గా పనిచేస్తున్నామని ఫరియా అబ్దుల్లా వెల్లడించారు.ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఉండటం ఒకప్పుడు తనకు మైనస్ అని చాలామంది అనేవారట. కేవలం గెస్ట్ రోల్స్ కు మాత్రమే సెట్ అవుతావు అని ముఖం మీదే కామెంట్స్ చేసేవారని ఫరియా గుర్తు చేసుకుంది. కానీ తనేంటో తన సినిమాలతోనే నిరూపించుకోవాలని నిర్ణయించుకుని ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం తమిళంలో ‘వల్లి మయిల్’ అనే సినిమా కోసం స్టంట్స్ కూడా చేస్తూ కొత్త ఫారియాను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.
Latest News