|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:19 PM
టాలీవుడ్‌లో పరాజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, తన కెరీర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు తను చేసిన 9 సినిమాలూ విజయాలు అందుకున్నా, తనకు నిజమైన 'హై' ఇచ్చింది మాత్రం కేవలం తన తొలి చిత్రం 'పటాస్' మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో జరిగిన 'హై' అనే సినిమా ప్రెస్‌మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 'వరుసగా తొమ్మిది హిట్లు వచ్చినా, తొలి సినిమా 'పటాస్' ఇచ్చినంత హై ఇస్తుందా?' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనిల్ రావిపూడి బదులిచ్చారు. "దర్శకుడిగా నన్ను పరిచయం చేసిన సినిమా కాబట్టి 'పటాస్' సక్సెస్ ఇచ్చిన హై వేరే లెవెల్. కానీ, ఆ తర్వాత ప్రతి సినిమా విడుదలకు ముందు హై కంటే టెన్షనే ఎక్కువగా ఉంటుంది. వణికిపోతుంటాను" అని అన్నారు."సినిమా హిట్ అయ్యాక హమ్మయ్య, బయటపడ్డాం అనిపిస్తుంది అంతే. నా జీవితంలో 'పటాస్'కే నిజంగా హై ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నుంచి దినదిన గండంలా, ఎలాంటి సినిమా చేయాలన్నా భయంగానే ఉంది" అని అనిల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
Latest News