|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:21 PM
భారీ చిత్రాలను సమర్థవంతంగా తెరకెక్కించగల దర్శకుల జాబితాలో గుణశేఖర్ కనిపిస్తారు. జానపదాలు .. పౌరాణికాలపై కూడా ఆయనకి మంచి పట్టుంది. అందుకు నిదర్శనంగా ఆయన రూపొందించిన 'రుద్రమదేవి' .. 'శాకుంతలం' సినిమాలు కనిపిస్తాయి. అనుష్క ప్రధానమైన పాత్రగా ఆయన 'రుద్రమదేవి'ని తెరకెక్కిస్తే, సమంత ప్రధానమైన పాత్రగా 'శాకుంతలం' ఆవిష్కరించారు. 2023లో 'శాకుంతలం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంటుగా ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ ..' రుద్రమదేవి' సినిమా వలన నాకు నష్టాలు రాలేదు. ఆ సినిమా వలన నాకు ఎలాంటి అప్పులు కాలేదు. కానీ 'శాకుంతలం' మాత్రం గట్టి దెబ్బనే కొట్టింది. ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఇబ్బంది పెట్టలేదు గానీ, థియేట్రికల్ వైపు నుంచి దెబ్బకొట్టింది. ఈ సినిమా వలన దిల్ రాజు గారు .. నేను ఇద్దరం కూడా సమానంగా రిస్క్ ఫేస్ చేయవలసి వచ్చింది. రావాల్సింది రాకపోవడం వలన ఇబ్బంది పడ్డాము" అని అన్నారు.
Latest News