|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:34 PM
టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కేవలం సినిమాలతోనే కాకుండా, రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయనకు విలాసవంతమైన ఇల్లు ఉంది, దీని బాల్కనీ నుంచి గోల్కొండ కోట కనిపిస్తుంది. శర్వానంద్ కుటుంబానికి సిటీలో చాలా ఆస్తులున్నాయని, ఆయన వ్యక్తిగత ఆస్తి సుమారు రూ.65-70 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవల 'OMI' పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్, హాస్పిటాలిటీ రంగాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు.బిజినెస్‌లోనూ తగ్గేదేలే.. కేవలం సినిమాలు, ఆస్తులే కాదు.. బిజినెస్‌లోనూ శర్వానంద్ స్పీడ్ పెంచాడు. ఈ మధ్యే 'OMI' పేరుతో ఓ కొత్త బ్రాండ్ అనౌన్స్ చేశాడు. ఇందులో ఫిల్మ్ ప్రొడక్షన్‌తో పాటు హాస్పిటాలిటీ సెక్టార్ కూడా ఉంది. దీని ద్వారా హైదరాబాద్‌లో ఒక వెరైటీ థీమ్‌తో హోటల్ ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీకి ఎంత ఆస్తి ఉన్నా, ఇండస్ట్రీలో మాత్రం తన సొంత కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానని, ఫ్యామిలీ మనీ మీద ఆధారపడలేదని శర్వా గర్వంగా చెబుతుంటాడు.
Latest News