|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 04:01 PM
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ వివాదంలో భాగంగా నిర్మాత వేసిన కేసును ఉపసంహరించుకోవడానికి మద్రాస్ హైకోర్టు అనుమతిచ్చింది. దీంతో చిత్రం సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లనుంది. క్లియరెన్స్ లభిస్తే ఈ నెలలోనే విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను మరోసారి రివైజింగ్ కమిటీకి పంపి సమీక్ష ప్రక్రియను కొనసాగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇకపై చట్టపరమైన చర్యలను కొనసాగించడం లేదని లేఖలో నిర్మాతలు పేర్కొన్నారు. CBFCకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటికే జన నాయగన్ నిర్మాతలు ఈ చిత్రాన్ని CBFC రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
Latest News