|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:20 PM
తెలుగు తెరపై నవ్వులు పూయించే కమెడియన్స్ లో సుదర్శన్ ఒకరు. నెల్లూరు యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ ను అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో 'సత్య' తరువాత సుదర్శన్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. అలాంటి సుదర్శన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మాది నెల్లూరు .. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతోనే 30 - 40 సినిమాలు చేశాను. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కొన్ని సినిమాలు చేస్తాననీ .. ఇంతవరకూ వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి నాతో కలిసి పనిచేసిన హీరోలు, ఆ తరువాత సినిమాలలో కూడా నాకే అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకు కారణం వాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉండటం .. నా టాలెంట్ వారికి నచ్చడం" అని అన్నాడు."నాకు మేనేజర్ ఎవరూ లేరు. నా సినిమాలకి సంబంధించిన విషయాలను నేనే మాట్లాడుకుంటాను. ఇంతవరకూ పారితోషికం విషయంలో పట్టుబట్టింది లేదు. కాస్త అటూ ఇటుగా చేసేస్తూ ఉంటాను. పారితోషికం కారణంగా అవకాశం చేజారిపోవడం ఇంతవరకూ జరగలేదు. సైలెంట్ గా నాకు ఇచ్చిన వేషాన్ని చేసేసి వెళ్లిపోతూ ఉంటాను. అందువల్లనే ఇన్ని సినిమాలు చేయగలిగానని అనుకుంటున్నాను" అని చెప్పాడు.
Latest News