|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:21 PM
బాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ కు సాయం చేసేందుకు సెలబ్రెటీలు ముందుకొస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో జైలుపాలైన రాజ్ పాల్ కు ఆర్థిక సాయం చేస్తున్నారు. మొన్న సోనూ సూద్ సాయం ప్రకటించారు. భవిష్యత్తులో తన సినిమాలో రాజ్ పాల్ యాదవ్ నటిస్తారని, అందుకుగానూ ఇప్పుడు కొంత మొత్తం ఆయనకు అందిస్తున్నానని సోనూ సూద్ చెప్పారు. ఇది సాయం కాదని, రాజ్ పాల్ యాదవ్ లోని నటుడికి గౌరవంగా ఇస్తున్న అడ్వాన్స్ అని పేర్కొన్నారు.తాజాగా జెమ్ ట్యూన్స్ మ్యూజిక్ అధినేత ఇంద్రజీత్ సింగ్ ముందుకొచ్చారు. రాజ్ పాల్ కు రూ.1.1 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. బాలీవుడ్ లోని మిగతా సెలబ్రెటీలు కూడా సాయం చేయాలని ఆయన కోరారు. కష్టకాలంలో ఉన్న సహచరుడికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
Latest News