|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 02:03 PM
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో 9.5 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'గేమ్ చేంజర్' ఫ్లాప్ తర్వాత కూడా చరణ్ సినిమాకు ఇంత పెద్ద డీల్ కుదరడం ఆయన క్రేజ్‌కు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న 'డ్రాగన్' సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 140 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Latest News