|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 01:56 PM
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని విమర్శించిన నేపథ్యంలో, నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి స్పందించారు. కుటుంబ సభ్యులపై విమర్శలు సరికాదని, చిరంజీవి మహిళలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. "మా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోను" అని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న 'సతీ లీలావతి' చిత్రం త్వరలో విడుదల కానుంది.“If anyone says anything about my family, I won’t tolerate it. That’s why I reacted” అంటూ ఆమె చేసిన ఆంగ్ల ట్వీట్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో లావణ్య సరసన దేవ్ మోహన్ హీరోగా నటిస్తుండగా తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News