|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:40 PM
సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదని, అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అంత జ్ఞానం కూడా లేదని సీనియర్ హీరో అర్జున్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న తన కూతురు నటించిన 'సీతా పయనం' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని, కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై మాట్లాడుతూ, ఆయన పనితీరు ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.కొత్తగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కుడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో అర్జున్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై అర్జున్ స్పందించారు
Latest News